18/03/2024
ఇయ్యాల్టి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
ఏప్రిల్ 2 వరకు నిర్వహణ
కానున్న 5.08 లక్షల మంది స్టూడెంట్లు
ఐదు నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్
2,676 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా పరీక్షలు కొనసాగుతాయి. ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే ఫిజిక్స్, బయాలజీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే ఉంటాయి. నిర్ణీత పరీక్షా సమయానికి ఐదు నిమిషాల ఆలస్యం గా వచ్చిన స్టూడెంట్లను కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికా రులు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలను పకడ్బందీ గా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 30 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఎవ రికైనా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 040-23230942కు కాల్ చేయాలని
సమస్యాత్మక కేంద్రంగా గుర్తించిన కమలాపూర్ బాయ్స్ హై
అధికారులు సూచించారు.
మూడంచెల భద్రత
నిరుడు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో హిందీ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఈసారి ఆఫీసర్లు ముందే అలర్ట్ అయ్యారు. పేపర్ లీకేజీలతో పాటు ఇతర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్ల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ ను నియమిస్తున్నారు. అంతే గాకుండా పోలీస్, రెవెన్యూ తో పాటు ఇతర డిపార్ట్ మెంట్ల అధికారులకు కూడా విధులు కేటాయిస్తున్నా రు.గత పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయడంతో పాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెం టర్లలో పనిచేసే సిబ్బందితో పాటు, తనిఖీలకు వచ్చే అధికారులు, స్క్వాడ్స్ కూడా ఫోన్లను బయట పెట్టేలా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు.
NEWS
Dated 18 Mar 2024