శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం

  • Home
  • India
  • Hyderabad
  • శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం

శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం, Hyderabad.

13/10/2024

*♦️శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు ... వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారు ... అంటూ విషప్రచారం చేస్తున్నారు.♦️*
*👽 వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే - మాక్స్ ముల్లర్ మానస పుత్రులు, పాశాంఢ ఎడారి మత మార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది "మా వంటి శూద్రులను (author of this article)" హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 👽👇*

*♦️అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...???*

*వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???*

*✅ పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహా కావ్యాన్ని రచించిన బోయవాడు అయిన రత్నాకర పూర్వ నామం కలిగిన వాల్మీకి మహర్షుల వారు శూద్రుడు కాదా...???*

*✅ మత్స్య గ్రంధికి జన్మించి పంచమ వేదం శ్రీమద్ భగవద్గీత, మహా భారతం వంటి పరమ పవిత్ర సనాతన గ్రంధాలను లిఖించిన కల్పి అనే పూర్వ నామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా...?? ఆయనను నారాయణుడి అంశగా, విశ్వ గురువుగా గౌరవించుకోవడం లేదా...? ఆయన జయంతి రోజును గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము కదా...!*
*✅ శూద్రునిగా పుట్టి దస్య కుమారుడు అయినా వేద జ్ఞానాన్ని ఆర్జించి రుషి అయి ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణమును రచించిన ఆత్రేయ ఋషి వారు శూద్రుడు కాదా...???*
*✅ పుట్టుకతో శూద్రునిగా జూదగానికి పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋగ్వేదంలో గొప్ప గొప్ప పరిశోధనలు చేసి, ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతి గాంచిన ఐలశు ఋషి వారు శూద్రుడు కాదా...???*

*✅ శూద్రురాలికి పుట్టిన జాబల కుమారుడైన సత్యాకాం వేద సారాలను గ్రహించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, సత్యానికి నిలువెత్తు గుర్తుగా, వినయం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారినే మెప్పించి, గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచి యజర్వేదం అందలి కొంత భాగానికి కర్తయైన సత్యాకాం, జాబల మహర్షుల వారు శూద్రుడు కాదా..???*
*✅ శూద్రురాలికి పుట్టినా కూడా వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మర్షి మాతంగి మహర్షుల వారు శూద్రుడు కాదా. ??మాతంగి మహర్షుల వారి గురుంచి శ్రీమద్ రామాయణంలోనూ, మహా భారతం అనుశాసనిక పర్వములో ప్రస్తావనలు ఉంటాయి...!*
*✅ పుట్టుకతో శూద్రురాలి కుమారుడైనా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతి గాంచిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు.ఇతడు శూద్రుడు కాదా.???*

*✅ పుట్టుకతో శూద్రుడు అయిన వత్సుడు గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషివత్స గా ప్రఖ్యాతిగాంచలేదా...? వీరు శూద్రుడు కాదా...??? Ref:-(ఆత్రేయ బ్రాహ్మణము - 2.19)*
*✅ శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి, బ్రహ్మ జ్ఞానంతో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందిన "కవష ఐలుషుడు" శూద్రుడు కాదా...???*
*✅ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడు శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మకి మాతృ ప్రేమని పంచాడు !! సాక్షాత్తు దేవుడే అన్నీ వర్ణాల యంధు జన్మించి అన్నీ వర్ణలని పావనం చేశాడు !!! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు..*

*✅ మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్న జాతివాడుగా భావించబడే పల్లెకారుడు (మత్స్యకారుడు) గుహుడికి దక్కింది. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీ రాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది..? మరి గుహుడు శూద్రుడు కాదా...???*
*✅ అద్భుతమైన వేద జ్ఞానంతో, సుమధుర గానంతో సాక్ష్యాత్ ఆ శ్రీరామచంద్రుల వారికే తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శబరి శూద్రురాలు కాదా...???*

*✅ స్వయంగా కవి పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగి విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి, తెలుగు ప్రబంధ కవి, ఆంధ్ర భోజుడిగా ప్రఖ్యాతుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు వారు శూద్రుడు కాదా...???*
*✅ అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన, ముర అనే శూద్ర మహిళకు జన్మించినా వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞత, మేధస్సు, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, శౌర్యం కలిగి, వ్యూహ నిపుణత, పట్టిన పట్టు విడువని వాడుగా అఖండ భారతాన్ని అప్రతిహతంగా పరిపాలించిన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు సామ్రాట్ చంద్రగుప్త మౌర్య శూద్రుడు కాదా...???*
*✅ మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివృత్తికి చెందినవాడు. మరి ఆయన శూద్రుడు కాదా...???*

*✅ విశ్వ కర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాయీ బ్రాహ్మణులు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వీరిలో అనేక లక్షల మంది వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి పౌరోహిత్యం చేస్తున్నారు. మరి వీరందరూ శూద్రులు కాదా...???*
*✅ వేద కాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగా మారి, తన వంటి మిగిలిన శూద్రులకు వేదపాండిత్యాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పంచి జనశృతి పౌత్రయణ జరిపిన రైక్వ ఋషి వారు శూద్రుడు కాదా...???*

*✅ కుమ్మరి వృత్తి చేసేవారి కుటుంబంలో జన్మించినా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో, భక్తితో, సుమధుర గానంతో సాక్ష్యాత్ పండురంగడినే ముగ్దుడ్ని చేసిన భక్త తుకారాం శూద్రుడు కాదా...? ఆయన ముని బహినాభాయ్ కు గురువుగా వ్యవహరించారు.*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా మారిన ఋషి నారాయణగురు వారు శూద్రుడు కాదా...???*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన కబీర్_దాస్ శూద్రుడు కాదా...??? కబీర్ దాస్ సూరత్ గోపాల్, జగుదాస్ వంటి జన్మతః బ్రాహ్మణులు అయిన పండితులకు గురువుగా ఉన్నారు...!*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు లక్ష్మణ్ సేన్ కు రాజగురువుగా ఎనలేని సేవలు అందించిన ఋషి ధోయి శూద్రుడు కాదా...???*
*✅ శూద్రునిగా పుట్టినా కూడా కళంగినథార్ శిష్యరికంలో వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో బంగారం తయారీపని చేసే తమిళ బోగర్ చైనా దేశం వెళ్లి హిందూ ధర్మ ప్రచారం చేశారు. మరి ఈయన శూద్రుడు కాదా...???*
*✅ మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో 63 శైవ నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "ఆదిపట్టన్" శూద్రుడు కాదా...???*
*✅ కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "అచ్యుతానంద" శూద్రుడు కాదా...???*
*✅ చర్మ కారుల వృత్తి చేసే కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ప్రఖ్యాతి చెందిన తమిళనాడు "అలగై" శూద్రుడు కాదా...???*
*✅ కళింగ రాజ్యాన కాటికాపరి వృత్తి చేసేవారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "బలరాం దాస్" శూద్రుడు కాదా...???*
*✅ కళింగ రాజ్యాన మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా వెలుగొందిన "భీమ దిబారా" శూద్రుడు కాదా...???*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ఋషి రవిదాస్ శూద్రుడు కాదా...??? ఋషి రవిదాస్ మీరాభాయ్, చిత్తోర్ ఘడ్ మహారాణి జలి, పాటికి మహారాణి మైనమతి లకు రాజగురువుగా విశేష సేవలు అందించారు...!*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ముని నామ్ దేవ్ శూద్రుడు కాదా...???*
*✅ శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చోఖ మేళ" శూద్రుడు కాదా...???*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన "సంత్ కణ్హోపుత్ర" శూద్రుడు కాదా...???*
*✅ " మహారాజు కవార్ధ" రాజ గురువు వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన శూద్రుడైన "గురు బాలాక్ దాస్" ...!*
*✅ జష్పూర్ యువరాజు రాజ్ కుమార్ దిలీప్ సింగ్ రాజ గురువు శూద్రుడైన "గురు రామేశ్వర్ ప్రసాద్ గాధర".!*
*✅ సాక్ష్యాత్ ఆది శంకరాచార్యుల వారు గురువుగా స్వీకరించి, తలవంచి నమస్కారం పెట్టింది కాటికాపరి అయిన ఒక శూద్రునికి, ఆ సందర్భంలో లిఖించేదే మనిష పంచక...!*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సంత్ ఘాసిదాస్" శూద్రుడు కాదా...???*
*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన తమిళులకు ఆరాధ్యుడు అయిన, 63 శైవ నాయనార్లలో ఒకరైన "తిరు వల్లువార్" శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శుచికారునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "వఖ్న" శూద్రుడు కాదా...???*
*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గురు విఠల్ రాంజీ షిండే" శూద్రుడు కాదా...???*
*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "సోయరా భాయ్"శూద్రురాలు కాదా...??*

*✅ మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెంది శివ, వైష్ణవ బేధాలను రూపుమాపిన "శోభి రామ్" శూద్రుడు కాదా...???*

*✅ పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "పిపాల్ దాస్" ఆయన కుమారుడు "శర్వణ దాస్" శూద్రులు కాదా...???*
*✅ పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "రామదాసు" శూద్రుడు కాదా...???*
*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "పరశురాం" శూద్రుడు కాదా...???*

*✅ పంజాబ్ లో రజక వృత్తి చేయువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "నామ్ దేవ్" శూద్రుడు కాదా...???*
*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "మోహిని దేవి" శూద్రురాలు కాదా...??*

*✅ తమిళనాట వీధులు శుభ్రం చేయు వారి కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ముని బాణన్" శూద్రుడు కాదా.?*
*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బహిరామ్ చోఖమేల" శూద్రుడు కాదా.??*

*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "బాలక్ దాస్" శూద్రుడు కాదా.??*
*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బంకా మహర్" శూద్రుడు కాదా.??*

*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "భాగు" శూద్రుడు కాదా.??*
*✅ ఉత్తర భారత దేశంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బీర్ భాన్" శూద్రుడు కాదా.??*

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చన్నయ్య" శూద్రుడు కాదా.??*
*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చిక్కయ్య" శూద్రుడు కాదా.??*

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చొఖ మేల" శూద్రుడు కాదా.??*
*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "దామాజీ పంత్"శూద్రుడు కాదా.??*

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "దేవి దాస్"శూద్రుడు కాదా.??*

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ధాన్నా"శూద్రుడు కాదా.??*

*✅ మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ఘసి దాస్"శూద్రుడు కాదా.??*

*✅ ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "గోపాలానంద్ మహరాజ్ " శూద్రుడు కాదా.?? ఈయన ఆర్య సమాజ్ లో కీలక సభ్యునిగా సేవలు అందిస్తూ బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేయబడ్డ అనేక వందల మంది హిందువులను ఘర్ వాపసీ చేసి, హిందూధర్మంలోకి తీసుకువచ్చారు... ఈయన అనేక భక్తి పాటలు, పద్యాలు రాసి, గానం చేశారు...!*

*✅ ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలో పుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సాధు జీతౌ జీత్ బహదూర్" శూద్రుడు కాదా.??*

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "కరమమేలం" శూద్రుడు కాదా.??*
*✅ జన్మతః శూద్రులుగా జన్మించినా కూడా వేద జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని సముపార్జించి ఋషులుగా, మునులుగా ప్రఖ్యాతి చెందిన...-👇*

🔯 సమ్ఖ్యాక (శుచికార వృత్తి)
🔯 అగస్త్య (వేట వృత్తి)
🔯 దుర్వాస (cobbler)
🔯 దాధిచి (lock smith)
🔯 కశ్యప (blacksmith)
🔯 రామాజా (copper smith)
🔯 కౌండిల్య (barber)
🔯 గోరా (గ్రామీణ పౌరోహిత్యుడు)
🔯 చోఖా (గోసంరక్షకుడు)
🔯 సావత (గ్రాసం తొలగించు వృత్తి)
🔯 కబీర్ (Weaver garments)
🔯 రోహిదాస్ (Colored hide )
🔯 సజనా (మాంస అమ్మకం)
🔯 నరహరి (Melted gold)
🔯 జనాభాయ్ (గో వ్యర్ధల సేకరణ వృత్తి)..

*✅ మరి వీరందరూ వేదాలు నేర్చుకుని ఋషివర్యులుగా,మునులుగా ఖ్యాతి గడించిన వారు. వీరు శూద్రులు కాదా...???*

*✅ ఇలా చెప్పుకుంటే పోతే అనేక లక్షల మంది శూద్ర హిందువులు వేదాలు చదివి, బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందారు, పొందుతూ హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తున్నారు...!*
*🔹 వేదాలలో కూడా ఇదే చెప్పారు.*

జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః

*🔹 (ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు)*

*✅ అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం). వేదం నేర్చిన వారే విప్రులు, బ్రహ్మ జ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా "వేద విధులతో సంచరించక, దేవతలను పూజించక, వివేకములు లేక, కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.*

"జన్మనా జాయతే శూద్రః,
సంస్కారాద్ది్విజ ఉచ్యతే!
వేదపాఠీ భవేద్వ్దిప్రః,
బ్రహ్మ జానాతి బ్రాహ్మణః!!

*✅ ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్ద విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు. ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.*

వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః
శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం
క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"
(ఇది మను ధర్మ శాస్త్రం 10-65 మంత్రం.)
*✅ భావం : బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రహ్మణుడే యగును. శూద్ర గుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదే విధంగా క్షత్రియ జాతి, వైశ్య జాతి కూడా కేవలం గుణ, కర్మాచరణల వలననే యేర్పడును.*

అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషమ్I
షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రంశత్ క్షత్రియస్యచII
భ్రాహ్మణస్య చతుః షష్ఠిః వూర్ణం వా అపి శతం భవేత్I
ద్విగుణావా చతుః షష్ఠిః తద్ధోషగుణః విద్ధి సఃII

*♦️ దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8 రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. శిక్షల విషయంలో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన మీరు గ్రహించగలరనుకుంటాను.!*
*🔹 ఇక హిందూ ధర్మంలో వేదాలు, శాస్త్రాలు అభ్యసించి బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందుతున్న శూద్ర హిందువుల గురుంచి రెండవభాగంలో సవివరంగా తెలియ జేయగలను

15/09/2024
15/09/2024
13/09/2024

*పిండప్రదానం అందరూ చేయవలసిందేనా?*
‘‘నాకు బ్రాహ్మణులు అంటే అసహ్యం. వారు డబ్బు మనుషులు. డబ్బు కోసం పీక్కు తింటారు. కనుకనే చాలా మంది ఇతర మతాల్లోకి వెళిపోతున్నారు. చనిపోయిన వారి పేరుతో డబ్బులు వసూలు చేసుకునే దోపిడీ దందా వారిది. చచ్చినోళ్ళు మనం పెట్టే పిండాలు తింటారా? కాకులకు పెడితే పోయినోళ్ళకు ఎలా చెందుతుంది? కాకులు కన్నా రాబందులు గద్దలు ఆకాశంలో ఎక్కువ దూరం ఎగురుతాయి. ఇవేం నరకం వరకూ ఎగరవు. మీరు చెబుతున్న పితృదేవతార్చనపై మాకు నమ్మకం లేదు. మీ దగ్గర సహేతుకమైన వివరాలుంటే చెప్పమని సవాల్ చేస్తున్నాము‘‘ అని ఒకరు గురుదేవులను సవాల్ చేయడం జరిగింది.
గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు వారిని ముందుగా కూర్చోమని బంట్రోతు చేత కాసిని నీళ్ళు తెప్పించి తాగమని అన్నారు. ఆ తరువాత ఆతని వివరాలు కనుక్కున్నారు. ఆ వ్యక్తి రాబోయే ముందుగా తాను చేస్తున్న పని ముగించిన తరువాత ఈ విధంగా చెప్పారు.
‘‘బ్రాహ్మణుల గురించి మీరు అన్నవాటికి సమాధానం చివరిగా చెబుతాము. ఇక చనిపోయిన వారికి పిండములు పెట్టాలా? అని అన్నారు. మాకు తెలిసినంత వరకూ, మా పురాణపీఠ పరిశోధనల వరకూ తన మన భేదం లేకుండా అందరూ చనిపోయిన పితరులకు పిండప్రదానం చేయవలసిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
పిండప్రదానం 5 విధాలుగా ప్రధానంగా ఉంటుంది. అది చనిపోయిన వ్యక్తి 12 రోజులలో చేసే పెద్దకర్మలు మొదటి పిండ వర్గంలోకి వస్తాయి. దాని తరువాత ఏడాది పూర్తి అయినప్పుడు చేసే సపిండీకరణం రెండవ వర్గ పిండదానం. దాని తరువాత ప్రతీ ఏడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆ చనిపోయిన తేదీన పెట్టేది నైమిత్తిక పిండం. ఇది మూడో వర్గం. అంటే ప్రతీ ఒక్కరూ ప్రతీ ఏడాదీ పెట్టి తీరవలసినది. ఇది కచ్చితంగా ఆరోజునే అందరూ చనిపోయిన వారికి పెట్టి తీరవలసినది. దీనికి మినహాయింపు ఎవరికీ లేదు. ఆ తరువాత కొన్ని ముఖ్యమైన రోజులలో పెట్టాలి. అంటే పితృపక్షాలు అనే పితరులు భూమి మీదకు వచ్చే రోజుల వంటివి. అలాగే షణ్ణవతులు అనే 96 రోజులుపైగా ఉన్నరోజులు. ఇవన్నీ ముఖ్యమైన రోజులే. అందరూ తమ పెద్దలకు పిండప్రదానం చేసి తీరాలి. ఇక ఐదోవర్గంలో ఉన్నవి కామ్యపిండప్రదానాలు అంటారు. అంటే మనం క్రీస్తును, అల్లాను, రాముడు కృష్ణుడు వంటి వారిని పూజించినట్టుగా మన పెద్దలను మనం పూజించాలి. మనకు ఉన్న కోరికలు తీర్చే బాధ్యత ఈ క్రీస్తు, అల్లా, రాముళ్ళకు లేదు. మనం పుట్టడానికి ప్రత్యక్షకారణం అయి రక్తమాంసాల దేహం ఇచ్చేవరకూ విస్తరించి ఉన్న పితృదేవతా డిపార్టుమెంటు పని మనం కోరే కోరికలు తీర్చడం అనే ప్రధాన బాధ్యత. ఈ పరలోక ప్రభువులు రామకృష్ణాదులు అంతా జగత్తుకు పితరులు. ఈ భేదాన్ని అంతా తెలుసుకోవాలి.
కనుక మన కోరికలు తీరాలంటే అర్చించాల్సింది ఇచ్చే అధికారం ఉన్న పితరులను కానీ ఇతరులను కాదు. ఏ విధంగా అర్చిస్తే వీరు కోరిన కోరికలు ఇస్తారు? అంటే దీనికి శాస్త్రం కొన్ని విధి నిషేధాలను చెప్పింది.
అశరీరులు, అయోనిజులు అయిన దేవతాదులను పూజించే విధానం వేరు. అంటే పరమేశ్వరుడు యోని సంభవుడు కాదు. ఓంకారవ్యక్తరూపుడు. కేవలం లింగస్వరూపుడు. ఆయన పుట్టలేదు. కనుక గిట్టడం అనేది లేదు. ఆయన కేవలం ఉద్భవించాడు. ప్రభవించాడు. అంటే సూర్యుడు ప్రతీ రోజు పుట్టడం లేదు. భూమి తిరుగుతూ ఉండడం వలన సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాము. కానీ ఆయన సుస్థిర స్థానంలో ఉన్నాడు. కానీ మనమే వెలుగూ చీకట్లు పొందుతూ సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అనుకుంటున్నాము.
దేవతామూర్తులు కూడా ఈ విధంగా ఉన్నవారే. అయితే వీరికీ పరమేశ్వరుడికీ ఉన్న తేడా జన్మించడం దగ్గర ఉంది. మహేశ్వరుడు వ్యక్తం అయ్యాడు అంతే కానీ విష్ణువు నుంచీ ఇతరులు ఆయన నుంచీ జన్మించిన వారు. సృష్టికోసం, పోషణ కోసం వారిని తన సహాయకులుగా జన్మనిచ్చాడు. వీరంతా మనలాగా యోని సంభవులు కాదు. కనుక వారిని ఎలా అర్చించాలి అనే విధానం పూజా విధానంగా ఉంది.
ఇక రక్తమాంసాలతో జన్మించిన వారిని ఎలా పూజించాలి అని తెలిపేవి అపరకర్మలు. నిత్య నైమిత్తిక కామ్యకర్మ ప్రయోగాలు. అవ్యక్తమైన పరమాత్మ లింగరూపుడు నుంచీ రక్తమాంస నిర్మిత శరీరాలతో పుట్టిన అమ్మానాన్నల వరకూ అనేక వ్యవస్థలతో శరీర నిర్మాణాలు జరిగాయి. ఇందులో మానవులకు ఐదు మరియు ఐదు ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారాదులతో శరీర నిర్మాణం జరిగింది. ఈ భౌతికమైన శరీరంలో రక్తమాంసవసమజ్జాది సప్తధాతువులు ఉన్నాయి. వీటి ఉత్పత్తి పోషణ నాశనం ఆహారం ద్వారా జరుగుతుంది.
తీసుకునే ఆహారం శుక్రశోణితాలుగా ఆడ, మగ వారిలో జనిస్తుంది. ఆడదాని అండం, మగవారి వీర్యం శారీరక కలయిక ద్వారా యోనిలో వీర్యాన్ని నిక్షిప్తం చేయడం వలన ప్రాణి జన్మపరంపరలు కొనసాగుతాయి. వీరిని యోనిజులు అంటారు. అలాగే చనిపోయినప్పుడు మరలా ఆహారం నుంచీ వచ్చిన శరీరం ఆహారంలో కలసి పోగా శరీర నిర్మాణంలో ఉన్న మనోబుద్ధిచిత్త అహంకారాలు అనేక శరీరాలు పొందుతాయి. వీటినే యాతనా శరీరం అంటారు. కారణ శరీరం అంటారు. ఇలా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అనేక శరీరాలు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యమైన శరీరాలు రెండు. యముడి చేత బాధలు పడడానికి యాతనా శరీరం ఏర్పడుతుంది. అంటే చనిపోయినప్పుడు గాలి రూపంలో యమపాశంలో చిక్కుకున్న ప్రాణికి స్పర్శాలు కలిగించి నరకబాధలు ఏర్పడడానికి యాతనా శరీరం ఏర్పడి తీరాలి. ఇలా నరకశిక్షలు అనుభవించకుండా ప్రాణికి పాపనాశనం కలుగదు. అలాగే స్వర్గంలో సుఖాలు అనుభవించాలన్నా ఈ యాతనా శరీరం ఏర్పడి తీరాలి. అప్పుడే స్వర్గలోక సుఖాలు రక్తమాంసశరీరాల మాదిరిగా అనుభవించగలుగుతారు. అలాగే కారణ శరీరం ఏర్పడి మరోజన్మలో మరో చోట జన్మించడం జరుగుతుంది.
ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఈ యాతనా శరీరం ఎలా ఏర్పడుతుంది? మరో జన్మకారణం ఎలా ఏర్పడుతుంది? అనేవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు.
దీనికి సమాధానమే పెద్దదినాలు పేరుతో అందరూ చేసే అంత్యేష్ఠిలో ఉంది.
చనిపోయిన ప్రతీవ్యక్తికీ 12 రోజులపాటు ప్రతీ రోజు కులాచారాల ప్రకారం పిండం పెట్టడం లేదా పాలు పోయడం వంటివి చేస్తారు. ఇదే ప్రేతపిండప్రదానం అంటారు. అంటే చనిపోయిన వ్యక్తికి చేసే పిండప్రదానం. ఇలా చేసే సమయంలో చదివే మంత్రాలు ఇవి.
1) ప్రథమదినే మూర్థాక్షి దంతాపయవభూత్యైదేహసిద్ధ్యర్థం అని మంత్రం ఉంది. అంటే మొదటి రోజున చనిపోయిన వ్యక్తి మరోజన్మలో మరో శరీరంలో తలకాయ, కళ్ళు, దంతములు మొదలైన అవయవములు కలుగాలని మొదటి పిండం పెడతారు.
2)చక్షుశ్రోతనాసముఖావయసిధ్యర్థం అని మంత్రం చదువుతారు. రెండో రోజు పిండం వలన మరోజన్మలో ఆ వ్యక్తికి ముక్కు, చెవులు, మూతి, దృష్టి, ముఖం వంటివి ఏర్పడతాయి.
3) కరాంసభువక్షో నిష్పత్యర్థం అనే మంత్రం చదువుతారు. ఇది చాలా ముఖ్యమైనది. మూడో పిండం ద్వారా మరుజన్మలో చేతుల, వక్షాదులు కలుగుతాయని, కలుగాలని మంత్రించిన పిండం వదులుతారు. నేడు 20వ శతాబ్దంలో మీ ఆంగ్లవైద్యులు లింగనిర్ధారణ 3వ మాసం నుంచీ మొదలవుతుందని అన్నారు. కానీ అది ఎప్పుడో కచ్చితంగా చెప్పడమే కాక చన్నులు అనే దానితో మొదలవుతుందని పిండప్రదానం ద్వారా అవి మరోజన్మలో కలుగడానికి అవసరమైన పోషణలను మూడో పిండం ద్వారా పంపుతారు.
4) నాభిలింగగుదనిష్పత్త్యర్థం అని లింగనిర్ధారణ జరిగాక మగవారికి పురుషాంగం, ఆడవారికి యోని నాభి నాలుగోరోజు పిండం వలన నిర్మితం అవుతాయని మంత్రం జపించి పిండప్రయోగం చేస్తారు. దీనితో మరోజన్మలో ఆవ్యక్తికి లింగావయవములు ఏర్పడతాయి.
5) జానుజంఘపాదావయవ సిధ్యర్థం అని ఐదవ రోజున పిండప్రదానం చేస్తారు. మృతుడికి మరో జన్మలో ఐదవ నెలలో తొడలు, పిర్రలు, పాదాలు వంటివి ఏర్పడడానికి అవసరమైన పోషణల కోసం ఐదవ పిండాన్ని ఇస్తారు.
6) సర్వమర్మావయవనిష్పత్యర్థం అని ఆరోరోజు పిండప్రదానం చేస్తారు. అంటే యోనిలోని గర్భాశయం, పురుషాంగం దగ్గరి వీర్యగ్రంథులు వంటి ముఖ్యమైన పునరుత్పత్తి అవయవాలు ఏర్పడడానికి అవసరమైన పోషణలను ఆరోపిండంతో మంత్రించి వదులుతారు.
7) మజ్జామేధోమాంసానాడీరూపావయవనిష్పత్యర్థం అని శరీరంలో ఎముకలు నాడులు, మూలుగ, మాంసం వంటి సప్తధాతు వృద్ధికీ ఏడవ పిండం ఏడోరోజు వదల బట్టీ తల్లి శరీరంలో ప్రవేశించిన మృతుడికి మరోజన్మలో ఎదుగుదల వచ్చి గర్భిణికి గర్భం బయటకు వస్తుంది.
8) దంతలోమనముఖావయవ నిష్పత్యర్థం అని రూప నిర్మాణం జరుగుతుంది. మరోజన్మలో 8వ పిండం వలన.
9) వీర్యావయవ వనిష్పత్యర్థం అనే తొమ్మితో పిండం ద్వారా శుక్రశోణిత వ్యవస్థ పరిపూర్ణత్వం కలుగాలని మంత్రిస్తారు.
10) దేహపూర్ణత్వ తృప్తతాక్షుద్వి పర్య సిద్ధ్యర్తం అని పదో రోజు వదిలే పదో పిండం మృతునికి మరోజన్మలో సంపూర్ణ శరీరం ఏర్పడాలని వదులుతారు.

చాలా ఆశ్చర్యమేమంటే ఈ పిండప్రయోగాల ద్వారా చెప్పిన శరీరనిర్మాణశాస్త్రం నేడు 20శ శతాబ్దంలో ఆంగ్లవైద్యులు తెలుసుకోవడం.
ఎవరైతే చనిపోయిన వారికి ఈ పదిరోజులు పిండాలు వదలరో వారి అమ్మానాన్నా మరో జన్మలో ఆ అవయవలోపంతో పుట్టి తమ వారసులను నాశనం కావాలని శపిస్తారు. అవే పితృదోషాలుగా సంప్రాప్తం అవుతాయి.
ఇది మొదటి పది రోజుల పిండప్రదానం ఆవశ్యకత.
ఇక పెద్దదినం తరువాత వచ్చే మాసికాలు మృతుడిని భూమి నుంచీ లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న యమపురికి తీసుకువెళ్ళే ప్రయాణంలో మృతుడి యాతనా శరీరానికి ఆహారంగా వదులుతారు. ఇలా మాసికములలో ఏటిసూతకం రోజువరకూ వదలక పోతే మృతుడు ఆకలితో దాహంతో అలమటిస్తాడు‘‘ అని చెప్పిన గురుదేవులు చివరిగా ఇలా చెప్పారు.
‘‘మీకు కోపం ఉంటే బ్రాహ్మణ అనే పదం ఉపయోగించి తిడితే మీ సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. బ్రాహ్మణులు ఈ అపరకర్మలలో అనేక పరీక్షలు పెడతారు. వాటిని నెగ్గుకొని చేయడమే మీరు చేయాల్సింది. ఎందుకంటే పితరుల అర్చనలు పాడు చేయడానికి అనేక భూత ప్రేత పిశాచాదులు దాడులు చేస్తాయి. ఇవి ఆవహించినవారు శ్మశానాల్లో పశువుల్లాగా, రాక్షసుల్లాగా హత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడరు. బ్రాహ్మణులను అనే ముందుగా మన బతుకులు ఉత్తమమైనవా అనే ప్రశ్న వేసుకోండి. ఎప్పుడో చచ్చి శ్మశానంలో ప్రశాంతంగా ఉన్నవారికి కూడా నిద్రకరువు చేస్తూ మీరు చేసే నికృష్టమైన పనులు చూసి భూతప్రేతపిశాచాలు కూడా హడలిపోయి వెళిపోతాయి.
అన్నిటికీ మించి ఆ సమయంలో కర్తకు కంటి వెంట నీరు కానీ, నోటి వెంట కఠినమైన పదాలు కానీ రాకూడదు. ఏ మాత్రం కోపం వచ్చినా కార్యం భ్రష్టమై మృతుడికి చెందకుండా, అనాథప్రేతపిశాచాలకు చెందుతుంది. అలాగే ధనలోపం చేసినా భక్తిలోపం చేసినా, శ్రద్ధాలోపం చేసినా కర్మ చంకనాకిపోతుంది. మృతుడు చింతచెట్టుకు వేళాతాడు. అటు నరకానికి పోడు, ఇటు శ్మశానం విడిచి వెళ్ళలేక ఆకలి దప్పికతో అలమటిస్తాడు.
రక్తమాంసాలతో జన్మించిన పితరుల అర్చన చేయించడం చాలా కష్టం. ఆ సమయంలో మీకు బ్రాహ్మణుల మీద కోపం రావడానికి కారణం బ్రాహ్మణులు కాదు. మీకు పట్టిన శని. మిమ్మల్ని పట్టిన భూతప్రేతపిశాచాలుగా తెలుసుకోండి. అవి ఆ కార్యం నాశనం చేయడానికి మిమ్మల్ని పట్టుకొని బ్రాహ్మణ ద్వేషాన్ని కలిగిస్తాయి.
కనుక తస్మాత్ జాగ్రత్త. మీ పని చచ్చిన వారికి భక్తి శ్రద్ధలతో పిండప్రదానం చేయడం. బ్రాహ్మణుల గుణగణాలు పరీక్షించడం కాదు.‘‘
========================
శ్రీక్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షము
31 జులై 24

*బుధవారం*
తాతముత్తాతలు, అమ్మానాన్నలను అర్చించి వారి ఆశీర్వాదం బుధవారం తీసుకుంటే సర్వవిజయాలు సొంతం అవుతాయి. ప్రతి వారం ఏ ఏ కోరికలు తీరడానికి పెద్దలను అర్చించాలో చెప్పారు. ఈ జాబితాలో లేని కోరికలు తీరడానికి కొన్ని తిథి వార నక్షత్రాలు చెప్పారు. అందులో బుధవారం ఒకటి. ఈ రోజు మనసులో ఏ కోరికలు ఉన్నా పెద్దలు తీరుస్తారు. కనుక ఏ కోరికలు తీరాలనుకున్నా దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు ప్రతి బుధవారం మేత వేయాలి.

*ఏకాదశి సాయంత్రం 5.05 వరకూ*
ఏకాదశిలో అమ్మానాన్నలను అర్చిస్తే రత్నాలు, పగడాలు, మాణిక్యాలు, రాగి, కంచు వంటి లోహధనరాశులు అన్నీ పొందుతారు. అందుకని ఏకాదశి వచ్చిన రోజున తప్పని సరిగా ఆవులకు మేత వేసి పెద్దలకు నమస్కరించుకోవాలి.
*రోహిణి మధ్యాహ్నం 12.23 వరకూ ఉంది.*
సంతానాన్నిచ్చే నక్షత్రాలలో రోహిణి ఒకటి. కనుక
సంతానం కావాలనుకున్నవారు ప్రతీ సారి రోహిణీ నక్షత్రం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ఆవులను సేవించి మేత వేసి నమస్కరించి తమ పితరులను ప్రార్థించాలి.
కనుక ఈ రోజు పెద్దలను అర్చిస్తే ఈ ఫలాలు వస్తాయి. అంతేకాక ఎవరికైన పైన చెప్పిన కోరికలు ఉంటే అవి వారం ఇస్తే ఆ వారం పెద్దలను అర్చించాలి. అలాగే తిథి, నక్షత్రం కూడా.
============================
మేము నిర్వహిస్తున్న గోసేవానిధికి క్రింది విధంగా పంపవచ్చు. అనంతసాహితి సంస్థ నిర్వహిస్తున్న గోసేవానిధికి గోగ్రాస నిమిత్తం సెల్ ఫోన్ ద్వారా పంపవచ్చు. మేము సామూహికంగా గోగ్రాసం వేస్తాము.భారత ప్రభుత్వ భీం ఫోన్ ఆప్, మీ బ్యాంకు ఆప్ ల ద్వారా క్రింది వాటిని ఉపయోగించి పంపవచ్చు.
for paytm, Phonepay, googlepay, Gpay
9247821505
7842224469
9652224469
9642224469
ఈ పితృదేవతా పంచాంగాన్ని ఒక రోజు ముందుగా ఆరోజు విశేషాలతో ఇస్తాము. ప్రతిరోజూ వచ్చే ఈ సమాచారం కోసం మా అనంతసాహితి ప్రచార బృందాల్లో చేరడానికి, పితృదేవతా గోదేవతా స్తోత్రాలు పొందడానికి 7842224469కి వాట్సప్ చేసి వివరాలు పొందండి.
*ముఖ్యగమనిక: అనంతసాహితి సాధికార నెంబర్లు ఇవి మాత్రమే. వేరు నెంబర్లు మీ దృష్టికి వస్తే దయచేసి మాకు తెలుపప్రార్థన. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి అనంతసాహితి సర్వసన్నద్ధతతో ఉంది. మీరు గోసేవానిధికి ద్రవ్యం పంపి మాకు 7842224469 వాట్సప్ ద్వారా మీ గోత్రనామాలు తప్పని సరిగా పంపండి. అలాగే స్వధా, పితృదేవతా, గోదేవతా స్తోత్రాలు చదవడమో వినడమో ఈ రోజుల్లో తప్పని సరిగా చేయాలి. ఇవి లేని వారు మాకు వాట్సప్ చేయండి.*
================================
స్వామి అనంతానందభారతి
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు*పిండప్రదానం అందరూ చేయవలసిందేనా?*

హైదరాబాద్, గుంటూరు

Address

Hyderabad
500047

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share